PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశాఖ ఉక్కు .. రికార్డుల మోత !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తిలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ నెలలోనే ఐదు సార్లు అత్యధికంగా హాట్‌ మెటల్‌ ఉత్పత్తి చేసి రికార్డులు నమోదు చేసిన స్టీల్‌ ప్లాంట్‌.. తాజాగా వాటిని అధిగమించింది. ఆవిర్భావ దినోత్సవం రోజైన శుక్రవారం.. బ్లాస్ట్‌ ఫర్నేస్‌–1లో 8,019 టన్నుల హాట్‌ మెటల్‌ను ఉత్పత్తి చేసింది. అంతకుముందు అత్యధికంగా ఈ నెల 8న 7,620 టన్నులు, 13న 7,670 టన్నులు, 15న 7,730 టన్నులు, 16న 7,835 టన్నులు, 17న 7,874 టన్నుల ఉత్పత్తి ద్వారా నెలకొల్పిన రికార్డులను అధిగమించింది. కార్మికులను సీఎండీ అతుల్‌ భట్, డైరెక్టర్‌ ఏకే సక్సేనా అభినందించారు.

                                  

About Author