విశాఖపట్నం.. విజయసాయిరెడ్డి పట్టణమైంది..!
1 min read
పల్లెవెలుగు వెబ్: విశాఖపట్టణం..అనధికారికంగా విజయసాయిరెడ్డి పట్టణమైపోయిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ విమర్శించారు. కన్నుపడితే కబ్జా, ఖాళీ చేయకపోతే జేసీబీలతో విధ్వంసమని అన్నారు. పెదవాల్తేరులోని 190 మంది వివిధ రకాల మానసిక సమస్యలతో ఉన్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతోన్న హిడెన్ స్ప్రౌట్స్ పాఠశాలని, ఏ2 రెడ్డి గ్యాంగులు కబడ్డీ పేరుతో కబ్జా చేయాలని చూశారని ఆరోపించారు. సాధ్యం కాకపోయే సరికి రాజారెడ్డి రాజ్యాంగానికి అనువైన శనివారం రోజు జేసీబీలతో కూల్చేశారని అన్నారు. మానసిక దివ్యాంగులకు నీడనిచ్చే పాఠశాలకు సాయం చేయాల్సింది పోయి,ఆక్రమించిన వైకాపా నాయకుల పాపాలు పండే రోజు దగ్గర పడిందని విమర్శించారు.