జనార్దన్ రెడ్డిని పరామర్శించిన విష్ణువర్ధన్ రెడ్డి..
1 min read
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సల్కోటి గోవర్ధన్ రెడ్డి వారి తండ్రి అయిన జనార్దన్ రెడ్డి (87) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డి విష్ణువర్ధన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం కడుమూరు జనార్దన్ రెడ్డి స్వగృహంలో విష్ణువర్ధన్ రెడ్డి పరామర్శించారు.గతంలో కొన్ని రోజులుగా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.తర్వాత ఇంటి దగ్గరే ఉన్నారు.ఆరోగ్య స్థితిగతులను విష్ణువర్ధన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. జనార్దన్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి సమీప బంధువులు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు కౌన్సిలర్ డి ధర్మారెడ్డి,కమతం వీరారెడ్డి ఉన్నారు.