విశ్వహిందూ పరిషత్,బజరంగ్దళ్ ఆధ్వర్యంలో 14 న శౌర్యసంచలన్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: 500 వందల సంవత్సరాల పోరాటం,వేలాది మంది హిందూ వీరుల ఆత్మబలిదానం అనంతరం చట్టబద్దంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యరామ మందిరం నిర్మింపబడుతున్న ఈ శుభ తరుణం లో హిందూ బంధువుల ఐక్యత కోసం రాబోయే 2023 సం.లో పూర్తి కాబోతున్న అయోధ్య రామమందిరం విశేషాలను ప్రపంచానికి,అశేష హిందూసమాజానికి తెలియజేయడం కోసం బజరంగ్దళ్ కార్యకర్తలు,ఇతర హిందూ యువకులను కలుపుకుని శౌర్యసంచలన్ పేరుతో మార్గశిర శుద్ద ఏకాదశి,గీతాజయంతి డిసెంబరు 14 మంగళవారము, మధ్యాహ్నం 3:00 గం.లకు పాతబస్టాండు వద్ద గల వివేకానందా సంస్కృత పాఠశాలలో కేంద్రంగా విశ్వహిందూపరిషత్ ర్యాలీ నిర్వహించబోతున్నామని కర్నూలు నగరం విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు డా.లక్కిరెడ్డి అమరసింహారెడ్డి,కార్యాధ్యక్షులు గోరంట్ల రమణలు రెవెన్యూ కాలనీలోని విశ్వహిందూపరిషత్ కార్యాలయం లో జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం లో తెలియజేశారు. బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ కేంద్ర సమితి ఆదేశాలమేరకు దేశ వ్యాప్తంగా బజరంగ్దళ్ ధ్యేయవాక్యాలైన సేవ,సురక్షా,సంస్కార్ లను యువకుల్లో పెంచడానికీ,వారిని జాగృతం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం శౌర్యం సంచలన్ కరపత్రాన్ని విడుదల చేశారు.కర్నూలు నగరం లోని హిందూ యువకులు,కుల సంఘాల నాయకులు,ధార్మిక సంస్థల కార్యకర్తలు,సేవాసంస్థల కార్యకర్తలు పాల్గొనాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి విజయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ విభాగ్ కన్వీనర్ నీలి నరసింహ, జిల్లా సహకార్యదర్శి శివప్రసాద్, కోశాధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రచార కన్వీనర్ రామకృష్ణ నగర కార్యదర్శిమాళిగి భానుప్రకాష్ నగర కన్వీనర్ ప్రసన్నకుమార్ రెడ్డి, నగర సాప్తాహిక్ మిలన్ కన్వీనర్ సాయిరామ్,బలోపాసనా కన్వీనర్ రాము,ప్రఖంఢ విశ్వహిందు, బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.