రాష్ట్రవ్యాప్తంగా విశ్వకర్మ జయంతి మహోత్సవాలు
1 min read– విశ్వకర్మ మహోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు మన ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది
– పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు విశ్వకర్మ మహోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రత్యేక జీవోను అమలుపరిచారని పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు.ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతిని పురష్కరించుకుని శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్,నగర మేయర్ బి వై రామయ్య, జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు, బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మమ్మ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు, వివిధ కార్పొరేషన్ ల డైరెక్టర్ లు పూలమాలలువేసి ఘన నివాళులు అర్పించినారు.పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేసే వ్యక్తి అన్నారు,విశ్వకర్మ మహోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రత్యేక జీవోను నెంబర్24 ను జారీ చేసి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. దేవతల రూపాలను ప్రజలకు తెలిపే వ్యక్తి అంటే అది విశ్వకర్మ అని చెప్పాలి. ఇప్పుడు ఉన్న ఆర్కిటెక్ అప్పటి విశ్వకర్మల వారి ద్వారానే మనకు వచ్చిందన్నారు. ఇలాంటివారిని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా విశ్వకర్మ జయంతిని పండుగలా చేసినందుకు మనందరం గౌరవ ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నారు.కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ విశ్వాన్ని సృష్టించిన ఇంజనీయర్ విశ్వకర్మ, ఇలాంటి మహా వ్యక్తి జయంతిని సెప్టెంబర్ 17న విశ్వకర్మ మహోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు మన ముఖ్యమంత్రివర్యులకు మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నారు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలిసారిగా ఈ జయంతి నిర్వహించుకుంటున్నామని ఆయన అన్నారు.నగర మేయర్ బి వై రామయ్య మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వబ్రాహ్మణులకు న్యాయం జరగాలని ఉద్దేశంతో విశ్వబ్రాహ్మణులను గుర్తించి విశ్వకర్మ జయంతి జరుపుకునేలా చేశాడు మన ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ఆర్కిటెక్ అనేది గతంలో కుమ్మరి, కమ్మరి, ఆచార్యుల దగ్గర నుండి వచ్చిందని ప్రస్తుతం కంప్యూటర్ల ద్వారా ఈ ఆర్కిటెక్ ను చూస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రివర్యులు రాష్ట్రంలో అనేక కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్ల పదవులు కూడా ఇచ్చాడని మనకున్న 25 మంది మంత్రులలో 15 మంది వెనుకబడిన జాతులు బీసీ, ఎస్సీ, ఎస్టీ జాతుల వారికే కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రిని ఆయన అన్నారు.జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నామని ఇప్పటినుండి సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ జయంతి జరుపుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అన్నారు.బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మమ్మ, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నామని అన్నారు. చేతి వృత్తులు, సంప్రదాయ కళలతో జీవనం సాగిస్తున్న విశ్వకర్మలకు ఆర్ధిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం విశ్వకర్మయోజనను సంప్రదాయ చేతి వృత్తిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, మద్దయ్య, టికే నారాయణ చారి, విజయాచారి, రవికుమార్ ఆచారి,తదితరులు పాల్గొన్నారు.