ఘనంగా విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం పత్తికొండలో విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవము విశ్వబ్రాహ్మణులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విశ్వకర్మకు ప్రత్యేక పూజలు, యజ్ఞ యాగాదులు నిర్వహించారు. స్థానిక గెస్ట్ హౌస్ నుండి అంబెడ్కర్ సర్కిల్ వరుకు బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు శ్రీ కమ్మర హరికృష్ణ ఆచారి, సీనియర్ నాయకులు శ్రీ శంకరయ్య ఆచారి మాట్లాడుతూ, విశ్వకర్మ భగవానుడు అంటే ఈ సృష్టికి మూలం అని, ఈయనకు ఎలాంటి పుట్టుక, మరణం లేని వ్యక్తిగా అభివర్ణించారు. అందుకే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమంగా అభిప్రాయ పడ్డారు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వకర్మ భగవాన్ ని గుర్తించి విశ్వకర్మ యోజన పథకం ద్వారా దేశంలో ఉన్న ప్రతి ఒక్క చేతి వృత్తి పనివారు వృత్తి పని చేసుకుంటూ జీవనం చేసే వారికి ఆర్థిక పరమైన సహాయం చేసి అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఇకపై ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ కుల వృత్తులు వారు అర్హులైన ప్రతిఒక్కరు సచివాలయలు ద్వారా అప్లై చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహానంది ఆచారి, బ్రహ్మయ్య ఆచారి, లక్ష్మీ నారాయణ ఆచారి, మనోహర్ ఆచారి, మధు ఆచారి, వేణు ఆచారి తదితరులు పాల్గొన్నారు.