వైస్సార్ జగనన్న భూ రక్ష- భూ సర్వే పై రైతులకు అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : వైస్సార్ జగనన్న భూ ర క్ష భూ రీ సర్వే, డ్రోన్ ప్లై ద్వారా చేపట్టి తద్వారా రైతుల భూ హద్దులను నిర్ణయించి ఇవ్వడం జరుగుతుందని మండల సర్వేయర్ సోమశేఖర్ అన్నారు, మంగళవారం స్థానిక ఎంపీడీవో సభా భవనంలో రైతులకు వైయస్సార్ జగనన్న భూ రక్ష భూ సర్వే కు సంబంధించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా మండల సర్వేయర్ సోమశేఖర్ మాట్లాడుతూ, జగనన్న భూ రక్ష భూ రీ సర్వే ద్వారా , చెన్నూరు గ్రామానికి సంబంధించి 14 వందల 67 ఎకరాల 19 సెంట్లల్లో రీ సర్వే నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు, ఇందులో రైతులకు సంబంధించి సుమారు 675 ఖాతాలు, 494 సర్వే నంబర్లు ఉన్నాయని, రైతులు చేయాల్సిందల్లా తమ భూములకు సంబంధించిన హద్దులను తమకు చూపిస్తే గ్రౌండ్ ట్రూయింగ్ నిర్వహించడం జరుగుతుంధని ఆయన తెలిపారు, అనంతరం ఎంపీపీ చిర్ల సురేష్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జీఎం భాస్కర్ రెడ్డి లు మాట్లాడుతూ, జగనన్న భూ రక్ష భూ పథకం ద్వారా డ్రోన్ సహాయంతో ఈ రీ సర్వే నిర్వహించడం జరుగుతుందని, రైతులకు సంబంధించిన భూములు సరిహద్దులు అదేవిధంగా గట్లు వంటివన్నీ కూడా ఈ సర్వేలో నిర్ణయించి రైతులకు తెలియజేయడం జరుగుతుందని వారు వారు తెలియజేశారు,గతంలో భూ సర్వే కి సంబంధించి రైతులు ప్రభుత్వ కార్యాలయాల్లో చుట్టూ తిరిగే వారని, ప్రస్తుతం అలాంటి బాధలు లేకుండా ప్రభుత్వమే రైతులకు వద్దకు వచ్చి వారికి సంబంధించిన భూములను సర్వే చేసి వారి భూ సరిహద్దులు చూపించడం జరుగుతుందని తెలిపారు , ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినందుకు రైతుల తరుపున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియ చేస్తున్నామని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో, ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు, డిప్యూటీ తాసిల్దార్ వెంకటరమణ, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, సర్పంచ్ సిద్ది గారి వెంకటసుబ్బయ్య, వీఆర్వోలు, రసూల్, జాకీర్, కార్యదర్శి రామ సుబ్బారెడ్డి సర్వేయర్ పవన్ కుమార్ ,విలేజ్ సర్వేలు వెంకటశివారెడ్డి, కార్యదర్శి, రైతులు పాల్గొన్నారు.