డ్రోన్ ద్వారా వైస్సార్ జగనన్న భూ రక్ష భూ సర్వే
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు వైస్సార్ జగనన్న భూ ర క్ష భూ రీ సర్వే డ్రోన్ ప్లై ద్వారా శుక్రవారం మండలంలోని ఉప్పరపల్లె గ్రామ పంచాయతీ లోని దుగ్గనపల్లె లో చేపట్టినట్లు మండల సర్వేయర్ సోమశేఖర్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న భూ రక్ష భూ రీ సర్వే నుఉప్పరపల్లె గ్రామ పంచాయతీ లోని దుగ్గనపల్లె గ్రామ పొలాల్లో 14 వందల 57 ఎకరాల 73 సెంట్లల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, ఇక్కడ రైతులకు సంబంధించి సుమారు750 ఖాతాలు ఉన్నాయని ఆయన అన్నారు, జగనన్న భూ రక్ష భూ పథకం ద్వారా డ్రోన్ సహాయంతో ఈ రీ సర్వే నిర్వహించడం జరిగిందని, అయితే దీని ద్వారా( ఆర్తో రెక్టిఫై ఇమేజ్) ఓ ఆర్ ఐ చేయడం ద్వారా, భూ సర్వే కు సంబంధించిన ఫొటోలు రెండు నెలలు తర్వాత రావడం జరుగుతుందని ఆయన తెలిపారు,ఇవి భూములకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందించడం జరుగుతుందన్నారు, అటుపిమ్మట రైతులకు సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేశారు, రైతులకు సంబంధించిన భూములు సరిహద్దులు అదేవిధంగా గట్లు వంటివన్నీ కూడా ఈ సర్వేలో సక్రమంగా తెలియజేయడం జరుగుతుందని ఆయన రైతులకు తెలియజేశారు, అంతేకాకుండా భవిష్యత్తులో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీని వల్ల రైతులకు ఉపయోగాలు ఏమిటి అనే విషయాలను కూడా క్లుప్తంగా వివరించడం జరిగిందన్నారు, గతంలో భూ సర్వే కి సంబంధించి రైతులు ప్రభుత్వ కార్యాలయాల్లో చుట్టూ తిరిగే వారని, ప్రస్తుతం అలాంటి బాధలు లేకుండా ప్రభుత్వమే రైతులకు సంబంధించిన భూములను సర్వే చేసి వారి భూ సరిహద్దులు చూపించడం జరుగుతుందని వారు తెలియజేశారు.. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన అందుకు రైతులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి రైతులు ధన్యవాదాలు తెలియ చేస్తున్నారని చేస్తున్నారని చేస్తున్నారని ఆయన అన్నారు, సర్వే కార్యక్రమాన్ని సర్వే ఆఫ్ ఇండియా పైలట్ వి, రవి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో, మండల వ్యవసాయ సలహా కమిటీ అధ్యక్షులు ఎరసాని మోహన్ రెడ్డి, ఎంపీటీసీ నిరంజన్ రెడ్డి, వీఆర్వో, వెంకటసుబ్బయ్య, సర్వేయర్ పవన్ కుమార్ ,విలేజ్ సర్వేలు వెంకటశివారెడ్డి, కార్యదర్శి, రైతులు పాల్గొన్నారు.