PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్రోన్ ద్వారా వైస్సార్ జగనన్న భూ రక్ష భూ సర్వే

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : వైస్సార్ జగనన్న భూ ర క్ష భూ రీ సర్వే డ్రోన్ ప్లై ద్వారా మంగళవారం చెన్నూరు ఎల్లమ్మ కాలనీ లో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టినట్లు మండల సర్వేయర్ సోమశేఖర్ తెలిపారు, ఈసందర్భంగా ఎంపీపీ, చీరల సురేష్ యాదవ్, సర్వేయర్ సోమశేఖర్లు మాట్లాడుతూ, జగనన్న భూ రక్ష భూ రీ సర్వే ద్వారా చెన్నూరు గ్రామ గ్రామ పొలాల్లో 14 వందల 67 ఎకరాల 19 సెంట్లల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, ఇక్కడ రైతులకు సంబంధించి సుమారు 675 ఖాతాలు, 494 సర్వే నంబర్లు ఉన్నాయని ఆయన అన్నారు, జగనన్న భూ రక్ష భూ పథకం ద్వారా డ్రోన్ సహాయంతో ఈ రీ సర్వే నిర్వహించడం జరిగిందని, అయితే దీని ద్వారా( ఆర్తో రెక్టిఫై ఇమేజ్) ఓ ఆర్ ఐ చేయడం ద్వారా, భూ సర్వే కు సంబంధించిన ఫొటోలు రెండు నెలలు తర్వాత రావడం జరుగుతుందని వారు తెలిపారు,ఇవి భూములకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందించడం జరుగుతుందన్నారు, అటుపిమ్మట రైతులకు సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేశారు, రైతులకు సంబంధించిన భూములు సరిహద్దులు అదేవిధంగా గట్లు వంటివన్నీ కూడా ఈ సర్వేలో సక్రమంగా తెలియజేయడం జరుగుతుందని ఆయన రైతులకు తెలియజేశారు, అంతేకాకుండా భవిష్యత్తులో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీని వల్ల రైతులకు ఉపయోగాలు ఏమిటి అనే విషయాలను కూడా క్లుప్తంగా వివరించడం జరిగిందన్నారు, గతంలో భూ సర్వే కి సంబంధించి రైతులు ప్రభుత్వ కార్యాలయాల్లో చుట్టూ తిరిగే వారని, ప్రస్తుతం అలాంటి బాధలు లేకుండా ప్రభుత్వమే రైతులకు సంబంధించిన భూములను సర్వే చేసి వారి భూ సరిహద్దులు చూపించడం జరుగుతుందని వారు తెలియజేశారు.. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన అందుకు రైతులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి రైతులు ధన్యవాదాలు తెలియ చేస్తున్నారని చేస్తున్నారని చేస్తున్నారని వారు అన్నారు, సర్వే కార్యక్రమాన్ని సర్వే ఆఫ్ ఇండియా పైలట్ ప్రసాద్( డోన్ )ఆపరేటర్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో, వైయస్ఆర్సీపీ మండల కన్వీనర్ జీయన్ ,భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ఎంపీటీసీ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, వీఆర్వోలు, రసూల్, జాకీర్, కార్యదర్శి రామ సుబ్బారెడ్డి సర్వేయర్ పవన్ కుమార్ ,విలేజ్ సర్వేలు వెంకటశివారెడ్డి, కార్యదర్శి, రైతులు పాల్గొన్నారు.

About Author