NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జైళ్ళ శాఖ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షునిగా విశ్వేశ్వర రావు

1 min read

– హర్షం వ్యక్తం చేసిన జైళ్ల శాఖ వార్డర్లు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా విశ్వేశ్వర రావు ఎన్నికవడం అభినందనీయమని ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు జైల్ వార్డర్లు జహురుల్లా, జాకీర్, ప్రదీప్, రామచంద్రారెడ్డి, సిరాజ్ లు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైళ్ల శాఖ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్ష పోటీలో వై సతీష్ మరియు నంబుల విశ్వేశ్వరరావు పోటీలో ఉన్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జైళ్ళ శాఖలో 1264 మంది ఉద్యోగులుండగా, 1108 మంది ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలు రైట్ 2 ఓట్ యాప్ లో ఆన్లైన్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో నంబుల విశ్వేశ్వర రావుకు 620 ఓట్లు రాగా వై సతీష్ కు 488 ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. నంబుల విశ్వేశ్వరరావు 132 ఓట్ల మెజార్టీతో గెలుపొంది నూతన అధ్యక్ష పదవికి ఎన్నికనట్లు ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు వెల్లడించారు. నంబుల విశ్వేశ్వరరావు గెలుపొందటంతో ఆయనకు నందికొట్కూరు సబ్ జైల్ వార్డర్లు శుభాకాంక్షలు తెలిపి సంబరాలు జరుపుకున్నారు.

About Author