NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిల‌మిలా మెరిసే చ‌ర్మం కోసం `సి` విట‌మిన్ త‌ప్ప‌నిస‌రి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: వ‌్యాధి నిరోధక శక్తి పెరుగుదలలో విటమిన్ సి ఎంతో ముఖ్య పాత్ర పోషించడం తెలిసిందే. విటమిన్ సి లేక ఆస్కార్బిక్ యాసిడ్ ఇమ్యూనిటీ పెంచడమే కాదు, శరీరంలోని వివిధ వ్యవస్థల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాదు, కాంతులీనే ఆరోగ్యకరమైన చర్మం కోసం విటమిన్ సి తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. చర్మ సంరక్షణకు అవసరమైన యాంటీఆక్సిడాంట్లను విటమిన్ సి అందిస్తుంది. దెబ్బతిన్న చర్మ కణాల మరమ్మతులు, చెడు పదార్థాల తొలగింపును సులభతరం చేస్తుంది. తద్వారా ముడతలు లేని చర్మం సొంతమవుతుంది. కొలాజెన్ పదార్థం ఉత్పత్తిని పెంచడం ద్వారా గాయాలు త్వరగా మానిపోయేలా చేస్తుంది. అందుకే డాక్టర్లు విటమిన్ సి సప్లిమెంట్లను ప్రత్యేకంగా సూచిస్తుంటారు.

                                            

About Author