వివేకా హత్య కేసు నిందితుడికి బెయిల్ నిరాకరణ
1 min readపల్లెవెలుగువెబ్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. తనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆమధ్య హైకోర్టు జారీ చేసిన తీర్పును సవాల్ చేస్తూ శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.