PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివేకా హత్య కేసు.. శివశంకర్ రెడ్డి పై చార్జీషీట్

1 min read

పల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ మేరకు పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు మరో చార్జిషీట్ వేశారు. వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి ఐదో నిందితుడిగా సీబీఐ పేర్కొంది. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా శివశంకర్ రెడ్డి ఉన్నారు. గతేడాది నవంబర్ 17న శివశంకర్ రెడ్డిని హైదరాబాద్ లో సీబీఐ అరెస్టు చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ గతంలోనే మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి పేర్లను చేర్చింది.

        

About Author