NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివేకా మ‌ర్డర్ కేసు.. రంగ‌న్నతో నాకు సంబంధం లేదు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ‘ఎవ‌రికైనా నా పేరు చెబితే నిన్ను న‌రుకుతా ’ అంటూ ఎర్ర గంగిరెడ్డి త‌నను బెదిరించార‌ని వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్య ఆరోపించిన నేప‌థ్యంలో .. వివేకా అనుచ‌రుడు ఎర్రగంగిరెడ్డి స్పందించారు. రంగ‌న్నతో త‌న‌కు ప‌రిచ‌య‌మే లేద‌ని చెప్పారు. తానెవ‌రినీ బెదిరించ‌లేద‌ని అన్నారు. తాను బెదిరించిన‌ట్టు క‌డ‌ప‌, పులివెందుల‌లో ఎక్కడా కేసులు లేవ‌న్నారు. వివేకాకు ద్రోహం చేసే వ్యక్తిని కాద‌ని, వివేకా హ‌త్య కేసుతో త‌న‌కు సంబంధం లేద‌ని ఎర్రగంగిరెడ్డి చెప్పారు. వాచ్ మెన్ రంగ‌య్య వ్యాఖ్యల‌తో వివేకానంద‌రెడ్డి హ‌త్య కీల‌క మ‌లుపు తిరుగుతోంది. వాచ్ మెన్ రంగ‌య్య ఇప్పటికే కీల‌క విష‌యాలు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

About Author