వివేకా హత్య కేసు.. 40 కోట్ల సుఫారి ఇచ్చిందెవరో జగన్ కు తెలుసు !
1 min readపల్లెవెలుగు వెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో 40 కోట్ల సుఫారీ ఇచ్చిందెవరో సీఎం జగన్ కు తెలుసని టీడీపీ నేత వర్లరామయ్య ఆరోపించారు. వైఎస్ వివేకాను చంపిందెవరో జగన్ కు తెలుసంటూ వర్లరామయ్య గతంలోనే ఆరోపించారు. అన్నీ తెలిసే సీబీఐ విచారణ అంటూ ఆయన ఆక్షేపించారు. ప్రతిపక్ష నేత హోదాలో సీబీఐ విచారణ కోరిన జగన్.. సీఎం అయ్యాక వెనక్కి తగ్గారని ఆరోపించారు. ఆ తర్వాత హైకోర్టులో వేసిన కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. రాజకీయాలను రక్తచరిత్రకు వాడుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.