వివేక హత్య కేసు.. ఎంపీ పై అనుమానం !
1 min readపల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వార హత్య చేయించారన్న అనుమానం ఉందని సీబీఐ పేర్కొంది. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపింది. కడప లోక్ సభ నియోజకవర్గం టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా.. తనకు లేదా వైఎస్ షర్మిల, విజయమ్మల్లో ఒకరికి రావాలని వివేకానందరెడ్డి ఆకాంక్షించారని, ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి .. వివేకాను హత్య చేయించి ఉంటారని అనుమానం ఉందని సీబీఐ వివరించింది. తమ దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొంది. హత్య వెనుక ఉన్న భారీ కుట్రను వెలికితీసే దిశగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది. ఈ కేసులో నిందితుల ప్రమేయం పై పులివెందుల కోర్టులో సీబీఐ గతంలో దాఖలు చేసిన చార్జిషీట్ వెలుగుచూశాయి. దర్యాప్తులోని కీలక అంశాలను సీబీఐ చార్జిషీట్ లో పేర్కొంది.