NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసు.. నిందితుల‌కు బెయిల్ నిరాక‌ర‌ణ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో నిందితుల‌కు క‌డ‌ప కోర్టు బెయిల్ నిరాక‌రించింది. కేసులో ప్ర‌ధాన నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి, ఉమాశంక‌ర్ రెడ్డిల బెయిల్ పిటిష‌న్ ను కోర్టు కొట్టివేసింది. నిందితుల బెయిల్ పిటిష‌న్ పై వాద‌న‌లు ముగియ‌డంతో బెయిల్ పిటిష‌న్ల‌ను కోర్టు కొట్టివేసింది. మ‌రోవైపు శివ‌శంక‌ర్ రెడ్డికి నార్కో ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి కోరుతూ సీబీఐ పులివెందుల కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. కోర్టు పిటిష‌న్ స్వీక‌రించింది. శివ‌శంక‌ర్ రెడ్డి అనుమ‌తి కూడ సీబీఐ కోర‌నుంది.

                                   
             

About Author