NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివేకానంద సూక్తులు..యువతకు స్ఫూర్తి : STU

1 min read

పల్లెవెలుగు వెబ్​ : కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని శాంతి టాలెంట్ స్కూల్లో స్వామి వివేకానంద 159 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మొదట స్వామి  వివేకానంద చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థినులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న STU నాయకులు మరియు అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ స్వామి వివేకానంద సూక్తులు యువతకు స్ఫూర్తి సందేశాలని ,ప్రతిఒక్కరు వివేకానందుడు చెప్పిన సూక్తులు కంఠత చేయాలని,వాటిని పునశ్చరణ చేసుకుంటూ ముందుకు వెళితే జీవితంలో ఎటువంటి సమస్యఎదురైన సులభంగా పరిష్కరించుకో గల   సామర్థ్యం వస్తుందని అన్నారు.ప్రతి మనిషి అదృష్టాన్ని నమ్ముకోవద్దని,శ్రమనునమ్ముకోవాలని వికానందుడు సూచించారు. అన్ని మతాల సారాంశం ఒకటేనని ,మతం కన్నా మానవత్వం గొప్పదని ,మానవ సేవే మాధవ సేవ అని నొక్కి చెప్పారన్నారు.ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు తిమ్మప్ప,నాగేశ్వరరావు, రహంతుల్లా,హమీద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author