వివేకానందుని జయంతి ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: పట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల యందు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిన్సిపల్ వసుంధర స్టాఫ్ మరియు విద్యార్థులు వివేకానందుని విగ్రహానికి పూలమాలతో మరియు పూలతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వసుంధర గారు మాట్లాడుతూ నేటి బిజీ ప్రపంచంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరి డ్యూటీలో వాళ్ళు చాలా బిజీగా ఉండటం వలన, యువతకు సమాజం పట్ల బాధ్యతను, నైతిక విలువలను, క్రమశిక్షణను నేర్పించవలసిన బాధ్యత ముఖ్యంగా నేటి గురువులపై కలదు. యువత వాళ్ళ లక్ష్యాలను సాధించాలంటే వాళ్ళలోని టాలెంట్ ను గుర్తించడం, ప్రేరణ చాలా అవసరం. అప్పుడే వాళ్ళు టాలెంట్ను పెంపొందించుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, మైనార్టీ విద్యార్థులకు మోటివేషన్ (ప్రేరణ) చాలా అవసరం. వారిలో ఏ క్వాలిటీస్ బాగున్నాయి అని గుర్తించి, వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు తెలుసుకొని ఆ రంగంలోనే వాళ్లకు ప్రోత్సాహం కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు గొప్ప స్థాయిలో రాణిస్తారు. పూర్తిగా సక్సెస్ లభిస్తుంది. జీవితంలో స్థిరపడతారు, కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు అలాగే ఆ ప్రాంతం, జిల్లా, రాష్ట్రం, దేశం ముందంజ వేస్తుంది. లేకుంటే యువత ఖాళీగా రోడ్లపై తిరుగుతూ చెడు వ్యసనాలకు లోనై సమాజం మొత్తం నాశనం అవుతుంది. మంచి ఆలోచనలు, మంచి భావనలు, క్రమశిక్షణ, విద్య పట్ల ఇష్టం, సమాజం పట్ల బాధ్యత, కుటుంబం పట్ల బాధ్యత విద్యార్థులు కలిగి ఉండి భారతదేశ అభివృద్ధికి సహకరించాలని ప్రిన్సిపాల్ వసుంధర కోరారు. ఇందులో పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్, మస్తాన్, సుంకన్న, హరికృష్ణ, రియాజ్, షాహింషా, శ్రీనివాసులు, మన్సూర్, సిద్దయ్య, ప్రవీణ్, ఫయాజ్, అశోక్, జగదీష్, వెంకన్న, మొ” స్టాఫ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.