వీఎల్ సీ మీడియా ప్లేయర్ నిషేధం !
1 min readపల్లెవెలుగువెబ్: కంప్యూటర్లలో, ఫోన్లలో చాలామంది వీఎల్ సీ మీడియా ప్లేయర్ ను వినియోగిస్తుంటారు. ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్. ఈ యాప్ ను ఒక్క భారత్ లోనే ఏటా 25 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేస్తుంటారు. అయితే వీఎల్ సీ మీడియా ప్లేయర్ ను భారత కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో నిషేధించింది. దీనిపై వీఎల్ సీ మీడియా ప్లేయర్ మాతృసంస్థ వీడియో లాన్ తీవ్రంగా స్పందించింది. భారత కేంద్ర ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపించింది. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో వీడియో లాన్ భారత టెలికాం విభాగానికి లేఖ రాసింది. ఎలాంటి కారణాలు చూపకుండా నిషేధం విధించడం సరికాదని, తమ యాప్ ను నిషేధించడంపై భారత కేంద్రం ప్రభుత్వం కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని వీడియో లాన్ పేర్కొంది. కనీసం తమ వాదనలు వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించింది. వీఎల్ సీ మీడియా ప్లేయర్ యాప్ ను ఎందుకు నిషేధించారో ఇప్పుడైనా వెల్లడించాలని డిమాండ్ చేసింది.