వీఓఎ సంఘం అధ్యక్షురాలు ఆత్మహత్య !
1 min read
పల్లెవెలుగువెబ్ : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. వీఓఎల సంఘం బందరు మండల అధ్యక్షురాలు గరికపాటి నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. అధికార పార్టీ నేత గరికపాటి నరసింహరావు వేధింపులు తాళలేక తన స్వగ్రామం భోగిరెడ్డిపల్లిలో నాగలక్ష్మి బలవన్మరణానికి యత్నించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అధికార పార్టీ నేత వేధింపులపై నెల రోజుల క్రితమే పోలీసులకు నాగలక్ష్మి ఫిర్యాదు చేసింది. నాగలక్ష్మి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా వేధింపులు అధికమవ్వడంతో నాగలక్ష్మి ఈ అఘాయిత్యానికి పాల్పడింది.