వినియోగదారులకు వొడాఫోన్ ఐడియా షాక్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ తెలిపింది. గత ఏడాది చివర్లో టారిఫ్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న వొడాఫోన్.. మరోసారి టారిఫ్ ధరలు పెంచే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో పెరిగిన ధరల మార్కెట్ స్పందనపై టారిఫ్‌ల పెంపు ఆధారపడి ఉండే అవకాశం ఉందని వొడాఫోన్ ఐడియా సీఈఓ రవీందర్ టక్కర్ అభిప్రాయపడ్డారు. టారిఫ్ రేటు పెరిగినందున సబ్‌స్క్రైబర్ బేస్ 26.98 కోట్ల నుంచి 24.72 కోట్లకు తగ్గింది. టారిఫ్ పెంపు ఉన్నప్పటికీ కంపెనీ సగటు యూజర్ ఆదాయం ఏఆర్‌పీయూ సుమారు 5 శాతం క్షీణించడం విశేషం. ఏఆర్‌పీయూ రూ. 115గా నమోదైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా మూడో త్రైమాసికంలో నష్టాలను చవిచూసింది.