PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాల్లో భాగస్వాములు కండి

1 min read

నంద్యాల జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్

  • ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ రక్త దాతల దినోత్సవం

నంద్యాల: స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటర్లో స్పందన కార్యక్రమం అనంతరం అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఈనెల 14 నుండి నిర్వహించే స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. స్వచ్ఛంద రక్తదాన ఉద్యమానికి మద్దతుగా ఆళ్లగడ్డ, బేతంచర్ల, నంద్యాల తదితర అన్ని మండల కేంద్రాలలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు ఏర్పాటు ఏర్పాటు చేసి రక్తదానంపై అవగాహన ర్యాలీలు సదస్సులు నిర్వహించి  ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.  అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు  రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి తెలిపారు. అంతకుముందు రక్తం గ్రూపులు, రక్తదాన ప్రక్రియను కనిపెట్టిన శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్ స్టైనర్ గారి చిత్రపటానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా అధికారుల చేత స్వచ్ఛంద రక్తదాన ఉద్యమానికి మద్దతుగా జిల్లాధికారులందరూ ప్రమాణం చేశారు.  ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా లెప్రసి అధికారి డాక్టర్ బాలాజీ, డిసీహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, రెడ్ క్రాస్ కోశాధికారి నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ భాషతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author