వాలంటీర్ సేవ.. భేష్..
1 min read–మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్‌కు వెళ్లి పింఛన్ అందజేసిన వైనం
– అభినందించిన కలెక్టర్, జేసీ–3
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: వైయస్సార్ పెన్షన్ పంపిణీ లో భాగంగా కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని గొందిపర్ల గ్రామం సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వాలంటర్ శ్రీనివాసులు తన క్లస్టర్ పరిధిలోని లక్ష్మీదేవి వృద్ధురాలికి మూడు నెలల పెన్షన్ ఇవ్వడానికి ఏకంగా ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణించాడు. మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ లో ఉన్నటువంటి వృద్ధురాలికి పెన్షన్ ఇచ్చి తన సేవా గుణాన్ని చాటుకున్నాడు. వాలంటీర్ శ్రీనివాసులు సేవను కలెక్టర్ జి. వీరపాండియన్, జేసీ–3 ఎంకేవీ శ్రీనివాసులు అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వాలంటీర్ శ్రీనివాసులను ఘనంగాసన్మానించి సర్టిఫికెట్, మెమొంటో, బ్యాడ్జి అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.