PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆడుదాం ఆంధ్రా క్రీడల నిర్వహణలో వాలంటీర్లదే కీలక బాధ్యత

1 min read

ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ ద్వారా ప్రతిభా అన్వేషణ: 

మున్సిపల్ కమిషనర్  కిషోర్.

అంకిత భావంతో క్రీడలు నిర్వహించాలి :ఎంపీడీఓ  శోభారాణి.

నియోజక వర్గ వార్డు వాలంటీర్ లకు “ఆన్ లైన్ స్కోరింగ్” శిక్షణా కార్యక్రమం.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంద్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి సచివాలయం స్థాయిలో నిర్వహించబోయే ఆడుదాం ఆంధ్రా -2023 క్రీడలలో ఆన్ లైన్ స్కోరింగ్ ఏ విధంగా నమోదు చేయాలి అనే అంశంలో నందికొట్కూరు నియోజక వర్గ పరిధిలోని ఆరు మండలాల సచివాలయాల పరిధిలో వార్డులోని ఇద్దరు వాలంటీర్ లకు నందికొట్కూరు పట్టణంలోని స్థానిక సాపూరు ఫంక్షన్ హాల్ నందు మున్సిపల్ కమీషనర్  కిషోర్  మరియు ఎంపీడీఓ శోభారాణి  ఆధ్వర్యంలో మంగళవారం  శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆరు మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. నంద్యాల డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరుఫున హాకీ కోచ్ సుదర్శన్  మాస్టర్ ట్రైనీ గా హాజరై “ఆన్ లైన్ స్కోరింగ్ “శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కిషోర్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ విజయవంతానికి కృషి చేస్తున్నదని ప్రతిష్టాత్మకమైన ఈ క్రీడలను అధికారులు, వాలంటీర్లు, వ్యాయమ ఉపాధ్యాయులు పరస్పర సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు.అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి  శోభా రాణి  మాట్లాడుతూ కాంపిటీటివ్ గేమ్స్ అయిన క్రికెట్, వాలీ బాల్,కబడ్డీ, ఖో- ఖో, షటిల్ బ్యాడ్మింటన్ లు సచివాలయ స్థాయిలో వార్డు వాలంటీర్లే నిర్వహించాలని ఈ క్రీడల నిర్వహణలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నంద్యాల మరియు కర్నూలు జిల్లాల శాప్ కో- ఆర్డినేటర్ లు స్వామిదాసు రవి కుమార్, శ్రీనాథ్ పెరుమాళ్ళ, నియోజక వర్గ ఇంఛార్జి  డోరతి, నందికొట్కూరు మండల ఇంఛార్జి వీరన్న, మిడ్తురు మండల ఇంఛార్జి వెంకటేశ్వర్లు, పగిడ్యాల మండల ఇంఛార్జి కృష్ణ, జూపాడు బంగ్లా మండల ఇంఛార్జి స్వరూప, పాములపాడు మండల ఇంఛార్జి రాజశేఖర్, కొత్త పల్లె మండల ఇంఛార్జి మురళీ నాయక్,  మరియు నియోజక వర్గ పరిధిలోని ఫిజికల్ డైరెక్టర్ లు పాల్గొన్నారు.

About Author