‘‘ఓట్’’ ఫర్ ఓపీఎస్ పుస్తక ఆవిష్కరణ
1 min readపాత పింఛను హామీ ఇచ్చేవారికే మా మద్దతు: యుటీఎఫ్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ ప్రధాన కార్యదర్శి నవీన్ పాటి ఆక్షేపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు సైతం ప్రభుత్వంలో భాగమేనని గుర్తించి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండు చేశారు. ఈరోజు సాయంత్రం స్థానిక K K భవన్ ఆవరణలో ఓట్ ఫర్ ఓపీఎస్ బుక్లెట్’లు ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హామీలు ఇవ్వని పక్క రాష్ట్రాలు పాత పింఛన్ విధానం వైపు అడుగులు వేస్తుంటే హామీ ఇచ్చిన సీఎం జగన్ ఉద్యోగులను మోసగిస్తుండటం దుర్మార్గమన్నారు. ఓట్ ఫర్ ఓపీఎస్ బుక్ లెట్ ద్వారా సీపీఎస్, జీపీఎస్ విధానంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు కలిగే నష్టాలను తెలియజేస్తూ ఉద్యోగ, ఉపాధ్యా యులను చైతన్యవంతులను చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు పోస్ట్ కార్డు ద్వారా పాత పింఛను అమలు చేయుటకు హామీ ఇవ్వాలని, అలా హామీ ఇచ్చిన వారికే ఉద్యోగ ఉపాధ్యాయుల మద్దతు అని ఇప్పటికే పోస్ట్ కార్డులు పంపించడం రాజకీయ పార్టీలకు మెమొరండలకు సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు హేమంత్ కుమార్, ఆర్థిక కార్యదర్శి యెహోషువ, కార్యదర్శులు తిమ్మన్న, దుర్గా వివిధ మండలాల అధ్యక్షులు ప్రసాద్, సురేష్, హనుమన్న, మారెప్ప, షబ్బీర్, కాంతారావు, రాముడు, తదితరులు పాల్గొన్నారు.