PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీకి ఓటెయ్యండి. అభివృద్ధికి పట్టం కట్టండి..

1 min read

యువ నాయకుడు. కాటసాని శివ నరసింహారెడ్డి..

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఎన్నికల వేడి రాజుకుంది నాయకులు ఊర్లను చుట్టేస్తున్నారు తన తండ్రి కాటసాని రాం భూపాల్ రెడ్డి గెలుపు కోసం తనయుడు కాటసాని శివ నర్సింహారెడ్డి సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు గడివేముల మండల పరిధిలోని కొర్రపోలురు సోమాపురం. గడివేముల టౌన్ లో. బుధవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించిన నాయకుడు కావాలంటే పాణ్యం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఓటు వేయాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాలలో జగనన్న ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని డోర్ టు డోర్ తిరుగుతూ గ్రామస్తులను కోరారు తన తండ్రి హయంలో అంతర్జాతీయ స్థాయి సోలార్ పరిశ్రమ ఏర్పాటు చేశారని స్థానికంగా యువతకు ఉపాధి కల్పించాలన .వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను ఇచ్చామన్నారు . మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా జగనన్న పేదవారికి ఇంటి స్థలాలను పంపిణీ చేయడం జరిగిందని రైతులకు ఆర్.బి.కే ద్వారా భీమా ఇన్పుట్ సబ్సిడీ రైతుపై విత్తనాలు ఎరువులను అందించామన్నారు అలాగే గ్రామాలలో సిసి రోడ్లు నిర్మించినట్టు అభివృద్ధి పథకాలను దాదాపు 99 శాతం హామీ ఇచ్చిన విధంగా అమలు చేశామని. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అలగనూరు రిజర్వాయర్ని యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేసి స్థానికంగా రైతులకు సాగునీరు అందేలా కృషి చేస్తామన్నారు. గడివేములలో బైపాస్ రహదారికి కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చిన తన తండ్రి కాటసాని రాంభూపాల్ రెడ్డి అందుబాటులో ఉంటారని అభివృద్ధి చేసే నాయకుడికే ఓటు వేయాలని ప్రతిపక్షాలు అభివృద్ధిని చూసి ఓర్వలేక అబద్ధపు ప్రచారాలను చేస్తున్నారని టిడిపికి ఓటు వేస్తే అభివృద్ధి 10 సంవత్సరాలు వెనక్కి పోతుందని కల్లబొల్లి మాటలను నమ్మొద్దని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కొర్రపోలురు సర్పంచ్ మూలింటి మాలిక్ భాష. మన్సూర్ భాష. మండల వైసిపి అధ్యక్షుడు శివరాంరెడ్డి. దస్తగిరి రెడ్డి. శివానందరెడ్డి. మేఘుడు. అనిల్ కుమార్ రెడ్డి. రాజారెడ్డి. రఘు మాధవరెడ్డి. గడివేములలో జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి. ఉప సర్పంచ్ బాల చేన్ని. దేశం నాగేశ్వర్ రెడ్డి. మైనార్టీ నాయకుడు మహబూబ్ బాషా. కో ఆప్షన్ మెంబర్ హుస్సేన్ భాష.నభి రసూల్. మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author