‘వీఆర్డీఎస్ ’ సేవలు.. భేష్
1 min read
పల్లెవెలుగువెబ్, రాయచోటి: కరోనా విపత్కర పరిస్థితులలో విఆర్డియస్ స్వచ్చంధ సంస్థ సేవలు అభినందనియమని రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేశ్వర రాజు పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా నిర్దారణ పరీక్షలకు అవసరమయ్యే దరఖాస్తు ఫారాలను విఆర్డియస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దుగ్గనపల్లి సురేంద్ర రెడ్డి వైద్యులు మహేశ్వర రాజుకు అందజేశారు. మహేశ్వర రాజు మాట్లాడుతు కరోనా క్లిష్ట సమయాలలో దాతలు పెద్ద మనసుతో సేవలు అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. భవిష్యత్తులోనూ తమ సంస్థ ద్వారా సహాయ సహకారాలు సంస్థ అధ్యక్షుడు దుగ్గనపల్లి సురేంద్ర రెడ్డి తెలిపారు.