సమయ పాలన, అధికార దుర్వినియోగం చేస్తున్న వీఆర్వో ను సస్పెండ్ చేయాలి
1 min read
ఆదోని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుండు పోగుల నేపాల్
మంత్రాలయం న్యూస్ నేడు : మండల పరిధిలోని చిలకలడోణ గ్రామం లో సమయం పాలన మరియు అధికార దుర్వినియోగం చేస్తున్న విఆర్ఓ ప్రభాకర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుండుపోగుల నేపాల్ డిమాండ్ చేశారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ వీఆర్వో పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయ పాలన పాటించకుండా చిలకలడోణ లో ఉన్న గ్రామంలోని ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. విఆర్ఓ ను వెంటనే సస్పెండ్ చేసి తగిన న్యాయం చేయాలని చిలకలడోణ ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ప్రజలు ఎన్నో సమస్యలపై వస్తుంటారని కానీ ఈయన మాత్రం అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆయనకు ఫోన్ చేసి ఫోన్ ద్వారా సార్ ఎక్కడున్నారని అడిగితే నేను ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఉన్నాను ఎందుకు నిమిత్తం వెళ్లారు సార్ మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఇష్టం సారంగా తిరుగుతున్నారని మూమెంట్ లెటర్ ఉందా అని అడగగా నీకెందుకు అంటూ అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు నిర్లక్ష్యం గా సమాధానం చెప్పుతున్నారని తెలిపారు. వీఆర్వో పై చర్యలు తీసుకోవాలని లేనియెడల ప్రజా సంఘాలను కలుపుకొని ప్రజల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమాల్లో శక మహానంది,సల్మాన్, ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.