PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి నెలా..జీతం కోసం ఎదురుచూడాలి! : యూటీఎఫ్

1 min read

డీఏ,పీఆర్సీ తదితర బకాయిలు వెంటనే విడుదల చేయండి

  • యూటీఎఫ్​ రాష్ట్ర సహ అధ్యక్షుడు సురేష్​ కుమార్​

కర్నూలు, పల్లెవెలుగు: అధికారంలోకి వస్తే “ప్రతీ నెలా 1వ తేదీన జీతాలు, మెరుగైన పిఆర్సి, సకాలంలో డిఏలు, ఉద్యోగ, ఉపాధ్యాయులతో స్నేహపూరిత వాతావరణం ఉంటుందని” 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పిన మాట  దీనికి భిన్నంగా మెరుగైన పిఆర్సి. సకాలంలో డిఏలు ఇవ్వకపోగా 1వ తేదీన జీతం కూడా ఇవ్వడం లేదు. ప్రతి నెలా 17వ తేదీ వరకు జీతాల కోసం, పెన్షన్ల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడుతున్నదని యుటిఎఫ్ రాష్ట్ర సహధ్యక్షుడు సురేషకుమార్ అన్నారు.బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యుటిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు నిరసనలు నిర్వహించారు.కర్నూలు నగరంలో ధర్నా చౌకలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహధ్యక్షుడు సురేష్ కుమార్,జిల్లా అధ్యక్షుడు రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ పాటి మాట్లాడుతూ  ఆగష్టు 24వ తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సెప్టెంబర్ 2023 నాటికి అన్ని బకాయిలు చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం, ఆర్థిక శాఖ అధికారులు ఇచ్చిన హామీ ఈనాటికి నెరవేరలేదు. ఫలితంగా 18వేలకోట్లకుపైగా ఆర్థిక బకాయిలు ఉద్యోగులకు చెల్లించవలసి వస్తున్నదన్నారు. ఒక పక్క సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఆర్థిక పరిస్థితి మెరుగైందని చెబుతుండగా, ఆర్థిక శాఖ అధికారులు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదనిచెబుతున్నారు. ఇద్దరిలో ఎవరి మాటలు విశ్వసించాలో తెలియకున్నది. నేటికీ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇవ్వవలసి బకాయిలు .2022 జనవరి నాటికి పిఆర్సి. డిఏ అరియర్లు కొత్త డిఏ అరియర్లు (2 డిఏలు)పిఎఫ్, లోన్లు, పార్టెఫైనల్ పేమెంట్లుఏపిజిఎస్ఐ లోన్లు, ఫైనల్  పేమెంట్లుసరండర్ లీవులు తదితర  బకాయిలు మొత్తం 18 వేల కోట్లు చెల్లింపుకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ “పోరుబాట” చేపట్టింది. కావున, ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు విడుదల చేయాలని, ప్రతి నెలా ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్ల సహధ్యక్షులు హేమంత్ కుమార్, ఆర్థికర్యదర్శి యహోసేవ.. జయరాజు.దుర్గాప్రసాద్, ఇబ్రహీం,చంద్రకళ, విజయలక్ష్మి, అనిల్, రఫీక్,మోహన్ తిమన్న, మార్క్, నాగరాజు, బాలరాజు, రాములు,వెంకటేష్ సర్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

About Author