PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నకిలీ ఎన్​ఓసీతో.. వక్ఫ్​ భూములు కొనరాదు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: నకిలీ ఎన్​ఓసీలతో వక్ఫ్​భూములు కొనరాదని, అలాంటి భూములు కొన్నా, అమ్మినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మరియు జిల్లా అడిషనల్ వక్ఫ్​ అధికారి మహబూబ్​బాష . ఏపీ వక్ఫ్​బోర్డు చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ విజయవాడ ఆదేశానుసారం వక్ఫ్​భూములపై తప్పుడు ఎన్​ఓసీ సృష్టించి విక్రయించిన ఓ వ్యక్తిపై 4వ పట్టణ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేయించినట్లు తెలిపారు. కల్లూరులోని సర్వేనెం.382లో దాదాపు 20 ఎకరాల వక్ఫ్​భూమిని ఆక్రమించుకున్న కౌసల్య మేనేజ్మెంట్ అండ్ స్ట్రక్చర్స్ కర్నూల్ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ కే ప్రవీణ్​ కుమార్​ తప్పుడు ఎన్​ఓసీ సృష్టించి ప్లాట్లు రిజిష్టర్​ చేయించుకున్నాడని, అతనిపై ఫిర్యాదు చేశామన్నారు. ప్రవీణ్​ కుమార్​పై చీటింగ్​ కేసు నమోదైందని, ప్రజలు గమనించాలని కోరారు.

About Author