‘తుంగభద్ర’ పక్కన… వాకింగ్ ట్రాక్
1 min read– సీసీ రోడ్డు నిర్మాణం…నాణ్యతగా చేపట్టండి
– కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు నగరంలోని తుంగభద్ర నది పక్కన నిర్మించే సీసీ రోడ్డు నాణ్యతగా ఉండాలన్నారు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్. మంగళవారం సాయంత్రం ఆయన సంకల్‌భాగ్‌లో పర్యటించారు. బండిమిట్ట నుంచి తుంగభద్ర నది పక్కనే జొహరాపురం వరకు సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. నది పక్కనే వాకింగ్ ట్రాక్ కు నాంది పలికేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజికి సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రామ్ లింగేశ్వర్, ఇరిగేషన్ అధికారులు చెన్నకేశవ నాయక్, మండల రెవెన్యూ అధికారి విజయ శ్ర ఉన్నారు.