NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాల గోడపత్రికలు విడుదల

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: మండల కేంద్రం హోళగుంద కొండ గుహలలో స్వయంభుగా వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు ఈనెల 13న కంకణాధారణ కార్యక్రమంతో ప్రారంభం అవుతున్న తరుణంలో శుక్రవారం శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం నందు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మాజీ సర్పంచ్ రాజా పంపన గౌడ ఆధ్వర్యంలో గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ మంగళవారము కంకణాధారణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆయన అన్నారు. 16 వ తేదీ శుక్రవారం నంది ఉత్సవము, 17వ తేదీ శనివారము గజోత్సవము, 18 వ తేదీ ఆదివారము మహా రథోత్సవము, 19వ తేదీ సోమవారము లంకా దహనము, 20వ తేదీ మంగళవారం  వసంతోత్సవ కార్యక్రమంతో శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు ముగియనున్నాయన్నారు.  అదేవిధంగా రథోత్సవ ఉత్సవాలను పురస్కరించుకొని ప్రజలు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు  శివ శంకర గౌడ, సిద్ధార్థ గౌడ, ఊళురు కాడ సిద్ధప్ప, మురళీధర్, వేద పండితులు రేణుకారాద్య,దేవాలయం పురోహితులు, మరేగౌడ, బొగ్గూరు రవి, బసవ, ఈరన్న భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author