సంక్రాంతి.. జనవరి 15న ప్రకటించడం బాధాకరం !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ, తెలంగాణల్లో సంక్రాంతి పండుగను జనవరి 15 వ తేదిన ప్రకటించడం బాధాకరమని భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ కర్తలు పొన్నలూరి శ్రీనివాస్ గార్గేయ అన్నారు. దేశంలోని 27 రాష్ట్రాలు సంక్రాంతిని జనవరి 14న ప్రకటించగా.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జనవరి 15న ప్రకటించడం బాధాకరమన్నారు. జనవరి 14 మధ్యాహ్నం 2.29 నిమిషాలకు మకర సంక్రమణమని కచ్చితంగా చెబుతున్నాయని తెలిపారు. నాసా ప్రత్యక్ష రుజువుకు ప్రధానంగా నిలబడేది దృగ్గణిత పంచాంగమన్నారు. పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేయవలసినది 14వ తేదీ మాత్రమే అని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ నిర్ణయం మార్చుకుని 14వ తేదీని మకర సంక్రాంతిగా ప్రకటించాలని కోరారు.