ఎన్టీఆర్ భవన్ పై దాడి చేసింది వీళ్లే !
1 min readపల్లెవెలుగు వెబ్: తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి చేసిన ఘటనలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి చేసిన 10 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. శేషగిరి, పవన్, అడపాల గణపతి, షేక్ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగరమణ, గోకదుర్గాప్రసాద్, పానుగంటి చైతన్య, పల్లపు మహేష్, పేరూరి అజయ్ లను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటి పై దాడి చేసిన కేసులో 11 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.