PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్తేరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి !

1 min read

పల్లెవెలుగువెబ్: గతంలో బాలకృష్ణ చిరంజీవి ఒకే సీజన్ లో తలపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ రాబోయే సంక్రాంతి మాత్రం చాలా స్పెషల్ గా నిలవబోతోంది. ఎందుకంటే ఒకే బ్యానర్ నుంచి రెండు భారీ చిత్రాల్లో ఈ ఇద్దరూ నువ్వా నేనా అంటూ రిలీజ్ డేట్ల విషయంలో ఎవరూ వెనుకడుగు వేయకపోవడం నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ ని ఇరకాటంలో పెట్టేస్తోంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ క్లాష్ డిస్ట్రిబ్యూటర్లకు ఎంత మాత్రం ఇష్టం లేదు. రెండూ వేర్వేరు సంబంధం లేని జానర్లైతే రిస్క్ చేయొచ్చు కానీ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్లైనప్పుడు దాని ప్రభావం నేరుగా ఓపెనింగ్స్ మీద పడుతుందని అందుకే వద్దని వారిస్తున్నారట.

అటు బాలయ్యకు సర్దిచెప్పలేక చిరంజీవిని ఒప్పించలేక ప్రొడ్యూసర్లు నరకమే చూస్తున్నారని ఇన్ సైడ్ టాక్. అనౌన్స్ మెంట్లు తేలిగ్గా ఇచ్చేశారు కానీ ముసళ్ళ పండగ ఇప్పుడు మొదలుకాబోతోంది. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు భారీ డిమాండ్ ఉంది. దానికి తగ్గట్టే పెద్ద మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకునేందుకు మైత్రి అధినేతలు రెడీ అయ్యారు. ఒకవేళ పోటీ తప్పదనుకుంటే స్వంతంగా రిలీజ్ చేసుకోమని, అంతే తప్ప తమ నుంచి ఎలాంటి రిస్క్ తీసుకునే పెట్టుబడులు రావని బయ్యర్లు తేల్చి చెప్పారట. అసలే మైత్రి ఈ సినిమాల నుంచి స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో దిగే ఆలోచనలో ఉంది. అందుకే దిల్ రాజు తప్పుకున్నారనే టాక్ ఉంది. ఈ సమస్య మరింత పెద్దదవ్వడానికి కారణం పండగ బరిలోనే ఆది పురుష్, వారసుడు, ఏజెంట్ లాంటి పెద్ద సినిమాలు ఉండటం. ఇవన్నీ నిజంగా వస్తే మాత్రం బిసి సెంటర్లలో థియేటర్లను సర్దటం తలకు మించిన పని. ఎందుకంటే గ్రామాలు, చిన్న పట్టణాల్లో అయిదారు కంటే ఎక్కువ స్క్రీన్లు లేనివి చాలా ఉన్నాయి. ఒకేసారి అయిదు సినిమాలు వస్తే షోలు చాలక జనం తాకిడిని తట్టుకోలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే జరిగితే టికెట్లు దొరక్క విసిగిపోయిన జనం ఓటిటిలో చూద్దాం లెమ్మని మళ్ళీ ట్రై చేయడం మానుకుంటారు. వీరయ్య బాలయ్యలో ఇద్దరూ తగ్గేలా లేరు కానీ చెరో ఇరవై రోజులకు పైగా ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉండటం అసలు ట్విస్టు.

About Author