జియో వ్యాపారంలో భాగస్వామి కావాలనుకుంటున్నారా… ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ టెలికం సంస్థ జియో త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ సీఎల్ఎస్ఏ ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఈ వ్యాపారాన్ని వేరుచేసి స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదు చేయాలని ముఖేశ్ అంబాని యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే జియోలో ఫేస్ బుక్ కు 10 శాతం వాటా, గూగుల్ కు 8 శాతం వాటా ఉంది. వీటితో పాటు మరో 11 సంస్థలకు జియోలో వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం జియోకు 426.5 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వచ్చే ఏడాది రిలయన్స్ జియో స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుందని సీఎల్ఎస్ఏ తెలిపింది.