బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీకో శుభవార్త !
1 min readపల్లెవెలుగు వెబ్ : బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. దేశీయ మార్కెట్లో రూపాయి విలువ పుంజుకోవడంతో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ధర వరుసగా మూడో రోజు పడిపోయింది. డాలర్ తో పోలిస్తే మూడు నెలల గరిష్ఠ స్థాయి 73 రూపాయల వద్ద ముగిసింది. దీంతో దిగుమతులపై ఆ ప్రభావం పడింది. ఢిల్లీ మార్కెట్లో అధిక స్వచ్చత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 47,424 నుంచి 47,287కు పడిపోయినట్టు ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపింది. బంగారం ధరల పై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీరేట్లు , జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.