చంద్రబాబు పేరు చెప్పాలంటున్నారు..?
1 min read
పల్లెవెలుగు వెబ్: జగన్ వీడియో మార్ఫింగ్ కేసులో చంద్రబాబు పేరు చెప్పాలని సీఐడీ అధికారులు వేధిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. చంద్రబాబే తనతో సెల్ లో వీడియో ప్లే చేయించారని చెబితే వదిలేస్తామని సీఐడీ అధికారులు అంటున్నారని ఆయన అన్నారు. జగన్ అక్రమ కేసులతో తన గొంతునొక్కాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని ఆయన అన్నారు. జగన్ కు క్యాబినెట్ పెట్టే దమ్ములేదని, విద్యార్థులకు పరీక్షలు ఎలా పెడతారని ప్రశ్నించారు. 9 గంటలపాటు దేవినేని ఉమను సీఐడీ అధికారులు విచారించారు. మే1న మరోసారి విచారణకు హాజరు కావాలని కోరారు. విచారణకు హాజరయ్యే సమయంలో తనతో పాటు ట్యాబ్ తీసుకురావాలని సీఐడీ అధికారులు కోరినట్టు దేవినేని ఉమ తెలిపారు.