19వ డివిజన్ లో మౌళిక వసతుల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు
1 min read
పలు సమస్యలు ఎమ్మెల్యేకి వివరించిన స్థానిక ప్రజలు
ఎన్టీఆర్ కాలనీలో పింఛన్లు పంపిణీ
సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
ఎమ్మెల్యే బడేటి చంటితో టిడిపి,కూటమి నాయకులు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రజలకు మౌళిక వసతుల కల్పనకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు 19వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చంటి దృష్టికి స్థానికులు పలు సమస్యలను తీసుకువచ్చారు. మెయిన్ డ్రైన్‌పై కల్వర్టులు విరిగిపోవడంతో అటుగా ప్రయాణాలు చేసే సమయాల్లో ఇబ్బందులెదురవుతున్నాయని, డ్రైనేజీ పూడుకు పోవడంతో మురుగునీరు పారుదలకు ఆటంకం కలిగి అపారిశుద్ద్య వాతావరణం నెలకొంటుందని తెలిపారు. దీంతోపాటూ మంచినీటి సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. ఆయా సమస్యలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎ. భానుప్రతాప్‌ను అక్కడికక్కడే ఆదేశించారు.వెనువెంటనే కమిషనర్ మున్సిపల్ సిబ్బందిని పంపించి మున్సిపాలిటీ లో ఉన్న డ్రైనేజీ కి సంబంధించిన కల్వర్టు బిళ్ళలు పంపి ఎమ్మెల్యే చెప్పిన పనిని హనుమాన్ నగర్ స్మశానం కి వెళ్లే రోడ్డు లో చర్చ దగ్గర యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేశారు. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చంటికి కృతజ్ఞతలు తెలియజేశారు.
