యుద్ధ సంక్షోభం.. నష్టాల్లో మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : స‌్టాక్ మార్కెట్లను రష్యా, ఉక్రెయిన్ యుద్ధ భయాలు వీడటంలేదు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ సెక్టార్ నష్టాల్లో కొనసాగుతుండగా.. పవర్ సెక్టార్ లాభాల్లో ఉంది. కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ఉక్రెయిన్–రష్యా యుద్ధ సంక్షోభం, ద్రవ్యోల్బణం అంశాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 325 పాయింట్ల నష్టంతో 59121 వద్ద, నిఫ్టీ 77 పాయింట్ల నష్టంతో 17706 వద్ద ట్రేడ్ అవుతోంది.