PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆప్యాయంగా పలకరిస్తూ.. మద్దతు కోరుతూ…

1 min read

ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే  అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక

పల్లెవెలుగు వెబ్  ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రజలందరికీ ఫలాలు అందించిన గొప్ప నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వకర్త శ్రీమతి “బుట్టా రేణుక” ఎమ్మిగనూరు పట్టణంలో 2వ వార్డు టోపయ్య గుడి నందు స్వామి వారిని ప్రత్యేక దర్శనం చేసుకొని అనంతరం వార్డు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు.నాయకులు  కార్యకర్తలతో కలిసి ప్రతి కార్యకర్తను కలుస్తూ పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలకున్న సమస్యలు వింటూ హామీలు ఇస్తూ నన్ను ఆశీర్వదించండి మీకు తోడుగా నేనున్నాను అంటూ చెప్పడం జరిగింది. రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు లో వైసీపీ జెండా రెపరేపలాడుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుట్టా శివనీలకంఠ , బుట్టా ప్రతూల్ గారు, 2వ వార్డు కౌన్సిలర్ అంపమ్మ , పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, వార్డుసభ్యులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, అభిమానులు. తదితరులు పాల్గొన్నారు.

About Author