NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆ సీరియ‌ల్ చూడండి : మోదీ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెప్టెంబరు నెలను పోషణ మాసంగా జరుపుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. పోషకాహార లోపానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ప్రతి నెలా ఆయన నిర్వహించే ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు. భారత దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఇంటింటా త్రివర్ణ పతాకం కార్యక్రమం ఘన విజయం సాధించిందని చెప్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అమృత స్వాతంత్ర్య మహోత్సవాలను ఇతర దేశాల్లో కూడా నిర్వహించారని తెలిపారు. దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న స్వరాజ్ సీరియల్‌ను చూడాలని ప్రజలను కోరారు. స్వాతంత్ర్య సమర యోధుల జీవిత విశేషాలను, వారు చేసిన త్యాగాలను ఈ సీరియల్‌లో చూపిస్తున్నారని తెలిపారు. అమృత మహోత్సవాల అమృత ధార దేశం నలుమూలలా ప్రవహిస్తోందన్నారు. అమృత స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మన దేశ సమష్టి బలాన్ని మనం చూడగలిగామని తెలిపారు.

                                        

About Author