NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు టీవీ చూడండి !

1 min read

Back view of a couple watching TV on sofa in the living room. Man is changing channels.

ప‌ల్లెవెలుగువెబ్ : ఉద్యోగాల‌ భర్తీపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. నిరుద్యోగులందరూ బుధవారం ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా తాను నిరుద్యోగులకు శుభవార్త చెబుతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఖాళీల వివరాలను సీఎం కేసీఆర్‌కు చీఫ్ సెక్రటరీ అందజేశారు. మరో 30 వేల ఖాళీలను కూడా భర్తీ చేయునున్నట్లు అసెంబ్లీలో కేసీఆర్ చెప్పనున్నారు.

                                           

About Author