వాటర్ బాటిల్ 3 వేలు.. ప్లేట్ రైస్ 7,500 !
1 min read
Human hand taking mineral water from shelf in supermarket
పల్లెవెలుగు వెబ్ : కాబూల్ లో తాలిబన్ల అరాచకం రోజురోజుకు పేట్రేగిపోతోంది. వారి ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఫలితంగా ప్రజలు దర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆప్ఘాన్ లో తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆప్ఘన్ పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వేలాది మంది ప్రజలు కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. ఎయిర్ పోర్టు వద్దకు వచ్చిన పౌరులకు తాలిబన్లు చుక్కులు చూపిస్తున్నారు. తాగునీటి కోసం, ఆహారం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఆహారం, నీరు అందక కొందరు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఆహారం, నీటిని ఎయిర్ పోర్ట్ బయట అత్యధిక ధరలకు అమ్ముతున్నారు. ఒక్క వాటర్ బాటిల్ ధర మూడు వేల రూపాయలకు, ప్లేట్ రైస్ ధర 7,500 రూపాయలకు అమ్ముతున్నారు. అది కూడ డాలర్లు అయితేనే నీరు, ఆహారం దొరుకుతుది. కొనలేని వారి పరిస్థితి ఇక చెప్పాల్సిన పనిలేదు. అత్యంత దారుణమైన స్థితి లో ఆప్ఘన్ ప్రజలు బతుకు నెట్టుకొస్తున్నారు.