NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వప్రయోజ‌నాల కోస‌మే జ‌ల‌వివాదం : జ‌గ్గారెడ్డి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులు రాజ‌కీయ ప్రయోజ‌నాల కోస‌మే జ‌ల‌వివాదాన్ని తెర‌పైకి తెచ్చార‌ని సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఆరోపించారు. జ‌ల‌వివాదం పేరుతో ప్రాంతాల మ‌ధ్య విద్వేషం రెచ్చగొడుతున్నార‌ని విమ‌ర్శించారు. సామ‌ర‌స్యపూర్వకంగా చ‌ర్చించుకుండా స‌మ‌స్యను మ‌రింత పెద్దదిగా చేస్తున్నార‌ని అన్నారు. మంత్రుల సైతం ఇష్టానుసారం మాట్లాడుతున్నార‌ని, ఇలా చేస్తే స‌మ‌స్య జ‌ఠిల‌మ‌వుతుంద‌న్నారు. ప్రజ‌లు క‌రోన క‌ష్టాలు ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో.. ప్రజ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు జ‌ల‌వివాదాన్ని తెర‌మీద‌కి తెచ్చార‌ని విమ‌ర్శలు చేశారు. జ‌గ‌న్, ష‌ర్మిల క‌లిసి ప్రజ‌ల్ని మ‌భ్యపెడుతున్నార‌ని విమ‌ర్శించారు. ష‌ర్మిల పార్టీ ఏర్పాటు వెనుకు బీజేపీ ప్రమేయం ఉంద‌ని ఆరోపించారు.

About Author