రెండు గ్రామాల మధ్య నీటి వివాదం…
1 min read– జడ్పిటిసి వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం
పల్లెవెలుగు వెబ్ మహానంది: మండలంలోని రెండు గ్రామాల మధ్య గత వారం రోజుల నుండి నీటి వివాదం నెలకొందిదీనికి తోడు జడ్పిటిసి మహేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు గంగ ప్రధాన కాలువ నుండి పదవ బ్లాక్ ద్వారా తిమ్మాపురం, అబ్బిపురం, పుట్టుపల్లె ,బొల్లవరం గ్రామాలకు చెందిన పంట పొలాలు దాదాపు 250 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. మిగిలిన నీరు వాగులు వంకల ద్వారా సమీపంలోని చెరువులకు చేరుతుంది. ఈ సాగునీరు కొంత భాగం తమ్మడపల్లె పంట పొలాలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే అదునుగా భావించిన ఆయన పదవ బ్లాక్ నుండి సాగునీటిని అక్రమంగా తరలించటానికి పిల్ల కాలువల ద్వారా వివిధ మార్గాల వైపు వెళ్లడానికి అవకాశం ఉన్న ప్రధాన కూడలిలో ఒకచోట అడ్డుకట్టను తన అనుచర వర్గంతో తొలగించడంతో వివాదం నెలకొన్నట్లు రైతులు పేర్కొన్నారు. గత ఏడాది తమ్మడపల్లె గ్రామ రైతుల పంట పొలాలకు సాగునీటి కోసం 11వ బ్లాక్ ను ఆధునీకీకరణ చేపట్టి సాగునీటి ఇబ్బందులు లేకుండా స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చొరవతో సమస్యను పరిష్కరించుకున్నారు. కానీ ఇప్పుడు పదవ బ్లాక్ నుండి కూడా నీటిని అక్రమంగా తరలించుకొని పోతే పంటలు పండించుకునేది ఎలా అని రైతులు ప్రశ్నించడంతోపాటు నా అనుమతి లేకుండా తొలగించిన అడ్డుకట్టను అధికారులు మరల ఏర్పాటు చేస్తే వారిని ఇంటికి పంపిస్తానని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. ఇతర గ్రామాల రైతులు తమ పొలాలకు తాగునీరు రాకుండా అడ్డుకట్ట వేసి నీటిని వాడుకోవడంతో తొలగించడానికి చర్యలు తీసుకున్నానని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది కాలువలు నిర్మాణ సమయంలో అధికారులు ఏర్పాటు చేసిన దిమ్మలను తొలగించారని మరలా రైతులు కొంత మొత్తంలో తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టిన దానిని కూడా తొలగించడంతో రైతులు తెలుగు గంగ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారుల ను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. తెలుగు గంగా డి ఈ నాగ మధుసూదన రావు మరియు ఏఈ జగదీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంలోనే జడ్పిటిసి ఫోన్ ద్వారా సంప్రదించగా పై వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఏదైనా సమస్య ఉంటే అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధి అధికారులను సస్పెండ్ చేయిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది .