NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీటి వివాదం .. డ్యాం వ‌ద్ద భారీ పోలీసు భ‌ద్రత‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నీటి వివాదం నెల‌కొన్న నేప‌థ్యంలో నాగార్జున సాగ‌ర్ డ్యాం వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అనుమ‌తి లేకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ త‌యారీకి నీటిని వాడుకుంటోంద‌ని ఏపీ ప్రభుత్వం ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో పోలీసు భ‌ద్రత‌ను ఏర్పాటు చేశారు. న‌ల్గొండ జిల్లా ఎస్పీ రంగ‌నాథ్ ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్ఐలు, 100 మంది సిబ్బందితో బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ముంద‌స్తు భ‌ద్రత ఏర్పాటు చేశామ‌ని ఎస్పీ రంగ‌నాధ్ తెలిపారు. ఏపీ-తెలంగాణ అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దు వ‌ద్ద కూడ భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.

About Author