NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీటి వివాదం ఓ డ్రామా.. జ‌గ‌న్,కేసీఆర్ తోడు దొంగ‌లు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : జ‌గ‌న్, కేసీఆర్ లు ఇద్దరూ తోడు దొంగ‌లని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని విమ‌ర్శించారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నీటి వివాదం పెద్ద డ్రామా అని అన్నారు. ఎన్నిక‌ల ముందు, త‌ర్వాత ఇద్దరూ ప‌ర‌స్పర స‌హ‌కారం అందించుకున్నార‌ని అన్నారు. ఇప్పుడు నీటి వివాదం రాజేసి… ఆంధ్రా, తెలంగాణ ప్రజ‌ల్ని పిచ్చోళ్లను చేసి ఆడుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆలింగ‌నాలు చేసుకుంటుంటే.. రాష్ట్రానికి మంచి జ‌రుగుతుంద‌ని అనుకున్నాన‌ని, కేవలం వ్యక్తిగ‌త ప్రయోజ‌నాల కోస‌మే ఇద్దరూ డ్రామా ఆడుతున్నార‌ని దుయ్యబ‌ట్టారు. 80 శాతం పూర్తయిన రాజ‌ధాని వ‌దిలి.. క‌ర‌క‌ట్ట అభివృద్ధి చేస్తాన‌న‌డాన్ని ఎలా చూడాల‌ని అన్నారు. ప్రజ‌లు పిచ్చోళ్లు కాద‌ని, అంతా గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు.

About Author