నీటి సమస్య.. ఉండకూడదు..
1 min readబోర్ల మరమ్మతు చేసి పరిష్కరించండి..
– అధికారులను ఆదేశించిన మునిసిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర
పల్లెవెలుగు వెబ్, మైదుకూరు: ఎండలు మండుతున్న నేపథ్యంలో పట్టణంలో తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు ప్రజలకు నీరు సరఫరా చేయాలని మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర మున్సిపల్ అధికారులకు సూచించారు. గురువారం ఉదయం పట్టణంలోని 16వ వార్డులో తాగునీటి సమస్య ఉందని ప్రజలు విన్నవించడంతో.. అక్కడికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. వార్డులో బోర్లు మరమ్మతు చేసి.. ప్రజల దాహార్తి తీర్చాలని ఆదేశించారు. ప్రజా సమస్యలు, వేసవిలో తాగునీటి సమస్య పరిస్కారం లో అధికారులు వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సహకారంతో మునిసిపాలిటీ లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేసిన మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర .. ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ షరీఫ్, కమిషనర్ పి.వి. రామకృష్ణ, 16వ వార్డు ఇంచార్జ్ బి.వి. శ్రీనివాసులు, మాధవ రామస్వామి దేవస్థానం చైర్మన్ సుబ్బారాయుడు, పట్టణ కన్వీనర్ లింగన్న, బి.పి రమణా రెడ్డి, పొలిమేర శివ, రవి శంకర్, లాలయ్య, రమేష్ రెడ్డి, కె.వి. ఎమ్మారెఫ్ సుబ్బయ్య, సుబ్రమణ్యం, ఏ.పి మహేష్, గిరి, కిట్టు పాల్గొన్నారు.